Dearness Allowance to the State Government Employees from 1st July 2011
హెల్త్ కార్డ్స్ నింపుటకు సూచనలు
మీ వివరాలు నింపుటకు లాగ్ ఇన్ అవ్వుట
- మొదటిగా హెల్త్ కార్డ్స్ నింపుటకు website (https://www.treasury.ap.gov.in/aptry/index.php) ఓపెన్ చేసి అందులో మీ treasury ID నెంబర్ ఎంటర్ చేయాలి.
- వెంటనే మీ పేరు వస్తుంది.
- ఆ తర్వాత మీకు నచ్చిన password ఎంటర్ చేయాలి.
- password 2 సార్లు ఎంటర్ చేయాలి.
- మీ DDO కోడ్ ని ఎంటర్ చేయాలి. ఆ తర్వాత లాగిన్ అవ్వాలి.
- మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా లాగ్ ఇన్ అయివుంటే మీ treasury ID ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇంతకు ముందు పెట్టుకున్న password ఎంటర్ చేయాలి.
- Password ని మర్చిపోతే మీ యొక్క STO ని కాంటాక్ట్ చేయాలి.
ఫారం 1 నింపుటకు సూచనలు:
- మీరు లాగ్ ఇన్ అయిన తర్వాత ఫారం 1 నింపవలసి వుంటుంది.
- ఫారం 1 నాలుగు భాగాలుగా వుంటుంది. 1 వ భాగం లో ఉద్యోగి వివరాలు 2 వ భాగం లో కార్యాలయ వివరాలు 3 వ భాగం లో నివాస వివరాలు 4 వ భాగం లో అదనపు వివరాలు పొందు పరచవలసి వుంటుంది.
- * గుర్తు కలిగిన వివరాలు తప్పనిసరిగా నింపవలసి వుంటుంది.
- సీరియల్ నెంబర్ 2 . సెక్టార్ టైపు లో State Govt/Zilla Parishad/Aided Educational Institutes/Zilla Praja Parishad/Mandal Praja Parishad/Gram Panchayat/Municipal Corporation ... ల నుండి ఒక దానిని సెలెక్ట్ చేసుకోవలసి వుంటుంది.
- సీరియల్ నెంబర్ 3 లో డిపార్టుమెంటు కోడ్ గా టీచర్స్ అందరూ స్కూల్ ఎడ్యుకేషన్ సెలెక్ట్ చేసుకోవాలి
- సీరియల్ నెంబర్ 4 లో Employee designation దగ్గర designation ఎంటర్ చేయాలి.
- సీరియల్ నెంబర్ 10 లో designation status లో gazetted లేదా నాన్-gazetted ఎంటర్ చేయాలి.
- సీరియల్ నెంబర్ 11 లో PRC 2012 ని సెలెక్ట్ చేసుకోవాలి.
- అన్ని వివరాలు సరి చూసుకున్న తర్వాత కింద వున్నా "Update to Continue" పై క్లిక్ చేసి ఫారం 2 కి వెళ్ళాలి.
ఫారం 2 నింపుటకు సూచనలు:
- అనీ వివరాలు సరి చూసుకున్న తర్వాత కుడి వైపు గల "Browse" పై క్లిక్ చేసి మీ ఫోటో ను upload చేయాలి. ఫోటో సైజు 100kb కి మించకూడదు.
- తర్వాత మీ dependents details ఎంటర్ చేయాలి.
- తర్వాత వారి ఫోటో కూడా upload చేయాలి.
- తర్వాత "ADD Details " పై క్లిక్ చేసి కుటుంబ సభ్యుల వివరాలు కూడా నింపాలి.
- అన్ని వివరాలు సరి చూసుకున్న తర్వాత "Submit to DDO and Print Form" పై క్లిక్ చేసి ప్రింట్ తీసుకొని మీ DDO కి అందచేయాలి, ఒక కాపీ మీ వద్ద వుంచుకోవాలి.
My Messages
